ఆకట్టుకున్న డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్

Publish Date:Nov 29, 2024

Advertisement

చెన్నైలోని సెయింట్‌ థామస్‌ మౌంట్‌లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుపై తాను చేసిన పరవ్‌పాయింట్‌ ప్రజంటేషన్  సభికులను ఆకట్టుకొందని, బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కన్సెల్టెంట్‌, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.

ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఎంగేజ్డ్‌ బుద్ధిస్ట్‌ నెట్‌వర్క్‌, తమిళ్‌ బుద్ధిస్ట్‌ సొసైటీ బుద్ధిస్ట్‌ హెరిటేజ్‌ టు వర్ట్స్‌ ఇంక్లూజివ్‌ సొసైటీస్‌ అన్న అంశంపై నిర్వహిస్తున్న 21వ ద్వైవార్షిక సమావేశంలో శుక్రవారం (నవంబర్ 29)  ఆయన ముఖ్య అతిథిగా హాజరై, బుద్ధవనం ప్రత్యేకతలపై ప్రసంగించారు. ఆ ప్రసంగంలో నాగార్జునకొండ చరిత్ర, ఆచార్య నాగార్జునుని రచనలు, తెలంగాణాలో బౌద్ధ ధర్మవ్యాప్తి, స్థావరాలపై వివరించారు.

శ్రీలంక, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, కొరియా, జపాన్‌ నుంచి సదస్సుకు హాజరైన బౌద్ధ భిక్షువులు, భిక్షుణీలు, బుద్ధవనాన్ని సందర్శించటానికి ఆసక్తి చూపారని, వారందరికీ బుద్ధవనం బ్రోచర్లను బహూకరించినట్లు శివనాగిరెడ్డి చెప్పారు. తరువాత నిర్వాహకుల తరఫున గౌతమ్‌ప్రభు, విజయన్‌, బుద్ధవనంపై ప్రసంగకర్త, బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని బౌద్ధ పద్ధతిలో సత్కరించారు.

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.